*రైల్వే క్యాజువల్ కాంట్రాక్టు,ఆల్ హమాలీ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలి.* - దుంపల రంజిత్ కుమార

Published: Tuesday October 25, 2022
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 23, ప్రజాపాలన: తెలంగాణ రైల్వే క్యాజువల్ కాంట్రాక్టు, ఆల్ హమాలీ వర్కర్స్ యూనియన్ సి ఐ టి యు ఆధ్వర్యంలో ఆదివారం రోజున తాండూర్ మండల కేంద్రంలో పలు సమస్యలు పరిష్కరించాలని సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి హాజరై మాట్లాడుతూ దేశంలోనే అతి పెద్ద సంస్థ రైల్వే. ఈ రైల్వే సంస్థలో వివిధ విభాగలలో కాంట్రాక్టు పద్ధతి ద్వారా లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు.కార్మికులు కస్టపడి పని చేస్తూ రైల్వే సంస్థకు లాభాలు తెస్తుంటే, కార్మికులకు మాత్రం కనీస వేతనాలు , పి ఎఫ్, ఈ ఎస్ ఐ, యూనిఫామ్, ఐడి కార్డులు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని వెంటనే పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మయ్య, శ్రీకాంత్, నవీన్, సురేష్, బాలరాజ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.