టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష స్థానానికి కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ నామినేషన్లు దా

Published: Tuesday October 19, 2021
మేడిపల్లి, అక్టోబర్ 18 (ప్రజాపాలన ప్రతినిధి) : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష స్థానానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.  కేసీఆర్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ నామినేషన్లు వేసిన వారిలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ నీతు కిరణ్, బడంగ్పేట్ కార్పొరేషన్ మేయర్ చిరిగింట పారిజాత నరసింహారెడ్డి, బండ్లగూడ కార్పొరేషన్ మేయర్ మహేందర్ గౌడ్, నిజాంపేట్ మేయర్ కే.నీలారెడ్డి,రామగుండం కార్పొరేషన్ మేయర్ బింగి అనిల్ కుమార్, ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పొనుకోళ్లు నీరజ ఉన్నారు.