పద్మల పురి కాకో ఆలయంలో దండారి సంబురాలు.

Published: Friday October 29, 2021
దండేపల్లి, అక్టోబర్ 28 ప్రజాపాలన : దండేపల్లి మండలం గుడిరేవు గోదా వరి తీరంలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం పద్మలప్పురి కాకో ఆలయంలో దండారి వేడుకలు ఘనంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర కిన్వట్ జిల్లా జవార్ల, ఆది లాబాద్ జిల్లా తాంసీ మండలం అట్నగడ, జైనూర్ మండలం బూసిమెట్ల, సిర్పూర్(యూ) మండలం దోబా నుండే కాక ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన గిరిజనులు, మహిళలు సుమారు 500 మందికి పైగా ఆలయానికి చేరుకుని ఉత్సవాలలో పాల్గొన్నారు. వీరంతా గోదావరి నదికి కాలినడకన చేరుకున్నారు. అక్కడ పుణ్య స్నానాలు ఆచరించి, నదీజలాలతో అమ్మ వారికి పూజలు చేశారు. దంచిన బియ్యంతో తయారుచేసిన అరి సెలు కూడా నైవేద్యం సమర్పించారు. అనంతరం మేకలు, కోళ్లు బలిచ్చి ఆలయం సమీపంలో వంటలు చేసుకొని సామూహిక భోజనాలు చేశారు. గుస్సాడీ నృత్యాలు, మహి ళలు సంప్రదాయబద్ధంగా నృత్యాలతో సందడి చేశారు. ఈనెల 31న దర్బార్.. ఆలయ కమిటీ సభ్యులు, గుస్సాడీలు ఆదివారం సాంప్రదాయ బద్ధంగా జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభిం చారు. అనంతరం జెండా గద్దె వద్ద సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. ఈ నెల 31న గుస్సాడీ దర్బార్ నిర్వహిస్తా మని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కుడిమెత సోము, సర్పంచ్ చిట్ల లింగవ్వ, మాజీ సర్పంచ్ చిట్ల మంజుభార్గవి, మాజీ ఎంపీటీసీ చిట్ల శ్రీనివాస్, నిర్వాహకులు పాల్గొన్నారు