ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు

Published: Thursday January 19, 2023

బోనకల్ ,జనవరి 18 ప్రజాపాలన ప్రతినిధి: నటసార్వభౌమ తెలుగుజాతి ముద్దుబిడ్డ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగువారి ఖ్యాతిని ప్రపంచంలో నలుమూలల విస్తరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. బోనకల్ గ్రామంలో నందమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం రాయన్న పేట గ్రామంలో రాయన్నపేట గ్రామ శాఖ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు విగ్రహ ప్రతిష్టకు ఏర్పాటుచేసిన భూమి పూజ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మధిర నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ వాసిరెడ్డి రామనాథం పాల్గొన్నారు. బ్రాహ్మణపల్లి గ్రామంలో గ్రామ శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి అన్నగారి చిత్రపటానికి పూలమాల వేయడం జరిగినది. మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు రావుట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ తెలుగుజాతి ఉన్నంతవరకు నందమూరి తారక రామారావు పేరు చిరస్థాయిగా నిలుస్తుందని, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా నేడు వర్ధంతి వేడుకలను జరుపుకుంటున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సాదినేని హనుమంతరావు, పార్లమెంటరీ రైతు అధ్యక్షుడు నందమూరి సత్యనారాయణ,జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి మైనేని రవికుమార్, రాష్ట్ర గిరిజన సంఘ కార్యదర్శి బానోతు శివలా నాయక్,జిల్లా నాయకులు మామిళ్ల కోటేశ్వరరావు, మండల యువత కార్యదర్శి మామిళ్ల నరసింహ రావు,మండల టీఎన్ఎస్ ఎఫ్ అధ్యక్షులు బంధం అనిల్ కుమార్ , మండల ప్రచార కార్యదర్శి చండ్ర. ప్రసాద్, బండి.రామారావు ,కొంగర జగన్మోహన్ రావు,పాటిబండ్ల సుబ్బారావు, మండేపూడి గోర్కె,తూము పురుషోత్తమ రావు,తోటకూర వెంకటేశ్వరరావు, మంద నరేందర్, మండల యువత నాయకులు వట్టి కొండ నవీన్ ,వంశీ,తూటిపల్లి శ్రీను,తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.