రాష్ట్రంలో మరో నూతన పార్టీ తెలంగాణ రక్షణ సమితి ఆవిర్భావం... హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):

Published: Friday November 11, 2022
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనే ధ్యేయంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం బిఆర్ఎస్ గా రూపాంతరం చెందడంతో రాష్ట్రంలో మరో నూతన పార్టీ తెలంగాణ రక్షణ సమితి ఆవిర్భవించింది.  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  ఆవిర్భావ సభను ఏర్పాటు చేశారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నరాల సత్యనారాయణ పార్టీ ఏర్పాటు కు గల ఆవశ్యకత, కారణాలను వెల్లడించారు.  వందలాదిమంది యువకుల ప్రాణదానాలు, ఏళ్ళ కొద్ది సాగిన తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పాలన అస్తవ్యస్తంగా ఉందని సత్యనారాయణ విమర్శించారు. ఉద్యమ ఆకాంక్షలు ఒక్కటి కూడా నెరవేరలేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా తమ పార్టీని స్థాపించినట్లు ఆయన తెలిపారు.