ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 15ప్రజాపాలన ప్రతినిధి

Published: Friday December 16, 2022

*29 నజరిగే  భారీ బహిరంగ సభకు  ఎర్రజెండా ముద్దు బిడ్డ పేదల ఆశ జ్యోతి  కేరళ ముఖ్యమంత్రి  వినయ్ విజయన్ గారు  పాల్గొంటున్నారు* *ఈ సభకు వేలాదిగా  జనం పాల్గొని జయప్రదం చేయాలి*

  ఈనెల  29 30 31 తేదీలలో ఖమ్మంలో జరిగే  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం  మూడవ రాష్ట్ర మహాసభలను జప్రదం చేయాలనీ  ఈరోజు గోడపత్రికను  యాచారం మండల కేంద్రంలో  విడుదల చేయడం జరిగింది సందర్భంగా  సంఘం  జిల్లా అధ్యక్షులు పి అంజయ్య  మాట్లాడు తూ  పోరాడి సాధించుకున్న ఉపాది హామీ చట్టాన్ని   నిర్వీర్యం చేసే కుట్ర  కేంద్ర బిజెపి ప్రభుత్వం  ప్రయత్నం చేస్తా ఉంది . పేదలకు  పట్టేడు అన్నము పెడ్తున్న ఉపాధి హామీ చట్టాన్ని  రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.
మండలంలో భూ సమస్యలు పరిష్కారం కాకుండా కోకొల్లలుగా ఉన్నాయి వాటిని పరిష్కారం చేయాలి  ముఖ్యంగా  సింగారం  తాటిపర్తి  కుర్మిద్ద  నంది వనపర్తి గ్రామాలకు చెందిన  500 మంది  రైతులు  తరతరాలుగా పేదలు 1400ఎకరాల భూమి సాగు చేసుకుంటున్న భూములకు  వెంటనే పట్టా పాసుపుస్తకాలు ఇవ్వాలి . ఇంటి స్థలం ఉన్న వారికి  డబుల్ బెడ్ రూమ్ కోసం  ప్రభుత్వం ఇస్తన్న3  లక్షల కాకుండా.5  లక్షలు మంజూరు చేయాలి  లబ్ధిదారుల దరఖాస్తులు గ్రామ సభల ద్వారా పారదర్శకంగా  తీసుకోవాలి. ఇళ్ల స్థలాలు లేని వారందరికీ  గతంలో ఎర్రజెండా నాయకత్వంలో  గుడిసెలు వేసిన స్థలాల్లో  సర్టిఫికెట్లు ఇచ్చినారు  ఆ స్థలాలల్లో సర్టిఫికెట్లు ఇవ్వాలి,  ప్రభుత్వ భూములకు  ధరణిలో  కొత్త పుస్తకాలు ఇవ్వాలి . బాండడ్ లేబర్ కు కొత్త పాస్ పుస్తకాలు మంజూరు చేయాలి .పట్టా భూములకు  భుదానా భూములను  సీలింగ్ భూములని   తప్పులు  పడినందున  సరిచేసి  పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలి
ప్రభుత్వం పేదలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ  పరిష్కారం చేయాలి  లేకపోతే మహాసభల అనంతరం  సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమైతాము ఈ కార్యక్రమంలో వ్య కాస జిల్లా కమిటీ సభ్యులు  కందుల శ్రీరాములు. రవి  లాలు తదితరులు పాల్గొన్నారు,