వరుణార్చన, అభిషేక మహాహోమం డిసెంబరు 1న జయప్రదం చేయండి.

Published: Tuesday November 30, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 28ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో పవిత్ర కార్తీకమాసంలో డిసెంబర్ 1న  వరుణార్చన, అభిషేక మహాహోమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదట ఈనెల 22న ఈ మహాహోమం నిర్వహించాలని తలపెట్టినప్పటికీ, నాలుగు రోజులపాటు కురిసిన ముసురు వర్షాల కారణంగా తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందేనని అన్నారు. డిసెంబర్ 1న ఉదయం 7.00 గంటలనుండి సాయంత్రం 5.00 గంటల వరకు వేదపండితులైన బ్రాహ్మణోత్తములు, ఋత్విక్కులతో ఈ మహాహోమాన్ని అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహించనున్నట్లు చెప్పారు. గత పదేండ్ల క్రితం వర్షాలకోసం మహా వరుణయాగం నిర్వహించిన స్థలంలోనే, వారుణార్చన చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలనుండి పెద్దఎత్తున భక్తులు, మహిళలు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు, ఆధ్యాత్మిక, భజన మండలుల సంఘాల సభ్యులు, కార్యకర్తలు పాల్గొని, వరుణ దేవుడికి అభిషేకంచేసి, హోమంలో సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని, స్వామివారి తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా ప్రతిఒక్కరిని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో  మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ సత్తు వెంకటరమణా రెడ్డి పాల్గొన్నారు.