వెల్వర్తి సర్పంచ్, కార్యదర్శి, ఉప సర్పంచ్ సస్పెండ్

Published: Thursday May 13, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెల్వర్తి గ్రామ సర్పంచ్ పసల అన్నా మేరీ, కార్యదర్శి తుమ్మల ఆనంద్ కుమార్, ఉపసర్పంచ్ తక్కెళ్ల శ్రావణి లపై ఆ గ్రామానికి చెందిన కొంత మంది వార్డు సబ్యులు గతంలో జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారికి పిర్యాదు చేయడంతో వారు విచారణ చేపట్టారు. నిధుల దుర్వినియోగం, పరిపాలనలో అధికార దుర్వినియోగం చేసినట్లు తేలడంతో వారు సర్పంచ్, కార్యదర్శి, ఉపసర్పంచ్ లను 6 మాసాలు సస్పెండ్ చేసినట్లు స్థానిక ఎంపిడిఓ గీతా రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.