సిపిఐ ఎంఎల్ 52 వ.ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

Published: Friday April 23, 2021

కొత్తగూడెం, ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధి : కామ్రేడ్ లెనిన్ జయంతి మరియు సిపిఐ ఎంఎల్  దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని ఐ ఎఫ్ టి యు.కార్యాలయంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పట్టణ కార్యదర్శి పి.సతీష్ జండా ఆవిష్కరణ చేయడం జరిగింది.అనంతరం జరిగిన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కొత్తగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ఆజాద్ మాట్లాడుతూ.ప్రపంచంలో తొలిసారిగా మార్క్సిజాన్ని రష్యా దేశపు భౌతిక పరిస్థితికి అనుగుణంగా అనుభవింప చేసి విప్లవం విజయవంతం చేసిన కామ్రేడ్ లెనిన్ జయంతిరోజునే 1969 ఏప్రిల్ 22న సిపిఐ ఎంఎల్ ఆవిర్భవించిందనిఅన్నారు .నాటి నుంచి నేటి వరకు అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి పోరాడుతుందని అతివాద మితవాద ధోరణు లుఎదుర్కొంటూ ముందుకు సాగుతుందని అన్నారు ఈ పాలకులు విధానాలకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు కై వై పోరాడుతూ ప్రజల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహిస్తుందన్నారు .బడుగు బలహీన వర్గాల పేద ప్రజల అభ్యున్నతికి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అనేక ఉద్యమాలు నిర్వహిస్తుందని ముఖ్యంగా పోడు భూముల రక్షణకై పోడు భూములకు పట్టాలు ఇచ్చేంత వరకు ఉద్యమిస్తామని అన్నారు.దినోత్సవ స్పూర్తితో ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ నాయకులు ఏం చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా. పాల్గొన్న పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు కృష్ణ నరసింహ చంద్రకళ. సమ్మయ్య .విజయ్. రాజశేఖర్ .కళ్యాణ్ .సంధ్య మరియమ్మ. లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.