కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి*జడ్పీ చైర్మన్ లింగాల

Published: Wednesday January 25, 2023
 కమల్ రాజు మధిర జనవరి 24 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో మంగళవారం నాడు దెందుకూరు గ్రామంలో ముఖ్యఅతిథిగా పాల్గొని రెండో విడత కంటి వెలుగు ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలని వారి కోరారుకంటి వెలుగు కార్యక్రమం దేశానికే ఆదర్శంపేదవారి సంక్షేమం బి ఆర్ ఎస్ తోనే సాధ్యం అని
జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో భాగంగా ఈరోజు మధిర మండలం దెందుకూరు గ్రామంలో స్థానిక మరియు మండల ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు గ్రామీణ ప్రాంతాల వారు పేదవారు కంటి చూపు లేక ఆసుపత్రికి వెళ్లి చూయించుకునే ఆర్థిక స్తోమత లేక బాధపడుతున్నటువంటి వారికి కోసం వైద్యులు గ్రామానికి వెళ్లి కళ్ళు పరీక్ష చేసి సమస్యకు సంబంధించిన కళ్ళజోడు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని ప్రతి పేదవాడి బాధను అర్థం చేసుకొని వారికి ఎంత సంక్షేమ పథకాలు అందజేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, వైద్యులు అధికారులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు.