సీజనల్ వ్యాధుల పట్ల అప్రమతంగా ఉండాలి.

Published: Tuesday September 20, 2022
పాలేరు సెప్టెంబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
సీజనల్ వ్యాధులు పట్ల అప్రమతంగా ఉండాలని ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్.మణిబాబు సూచించారు. మండలం లోని కోనాయిగూడెం లో సోమవారం ప్రత్యేక వైద్య శిభిరం ను నిర్వహించారు. వివిధ పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. ప్రజలకు తగు సూచనలు. సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆరోగ్య ఉప కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ, ఉప సర్పంచ్ వడ్లమూడి నర్సయ్య, కార్యదర్శి బోళ్ల వీరబాబు, పంచాయతీ కో-ఆప్షన్ సభ్యులు కుమ్మరి నాగమణి, ఏఎన్ఎం పద్మ, అబేదా, ఆశా కార్యకర్త చెరుకుపల్లి బేబి తదితరులు పాల్గొన్నారు. 1