మన భూమి మన ఆరోగ్యం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమం

Published: Friday April 08, 2022
మధిర ఏప్రిల్ 7 ప్రజాపాలన ప్రతినిధి మనభూమి మన ఆరోగ్యంప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మాటూరు పేట పి ఎస్ సి వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ ఆధ్వర్యంలో కృష్ణాపురం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజ్ నందు ప్రిన్సిపాల్ ఎస్ కె షమీం మేడం అధ్యక్షతన విద్యార్థులకు ఆరోగ్య అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు భాస్కర్ రావు మాట్లాడుతూ WHO ఈ సంవత్సరనినాదం మన భూమి, మన ఆరోగ్యంఅంటే పర్యావరణం మార్పుల తోనే ఎక్కువగా ఎండలు, కుండపోత వర్షాలు, జంతువుల నుండి మనుషులకు సంక్రమిస్తున్న ప్రతి మూడు అంటు వ్యాధులలో రెండు జంతువుల నుంచి వచ్చినవే! కలుషిత జలాలతో పండే ఆహార పదార్థాలు తినడం వల్ల వచ్చే క్యాన్సర్లు, జీర్ణ సంబంధిత అనారోగ్యాలు, ఎలుకల ద్వారా వచ్చే ప్లేగు, మొన్న వచ్చిన బ్లాక్ ఫంగస్, పురుగు మందుల ప్రభావం వల్ల ఆహార పదార్థాలు కలుషితం వల్ల గర్భిణీ స్త్రీలలో సమస్యలు, పిల్లల ఎదుగుదలలో లోపాలు, పిల్లలకు వచ్చే అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. కావున ప్రజలు గాలి కాలుష్యం, పర్యావరణ కాలుష్యం నుంచి తమను తాము రక్షించుకోవాలంటే నివారణ ఒక్కటే మార్గం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి మాస్క్ ధరించాలి సురక్షిత మంచినీరు త్రాగాలి అనవసరంగా