అనుమతులు లేకుండానే ప్లాట్ల వ్యాపారం

Published: Tuesday April 26, 2022
మంచిర్యాల టౌన్, ఏప్రిల్‌ 25, ప్రజాపాలన : అనుమతులు లేకుండానే ప్లాట్ల వ్యాపారం జిల్లా కేంద్రంగా కొందరు రియల్ వ్యాపారులు భూ దందా జోరుగా సాగిస్తున్నారు. రియల్ వ్యాపారాలు ప్రభుత్వ నిబంధనలు త్రుంగలో తొక్కి , ప్రభుత్వ ఖజానాకు గండి  కోడుతూ అమాయక ప్రజలను మోసం తీస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారని, లే అవుట్ లేకుండా ప్రభుత్వ అనుమతులు, నిబంధనలు పాటించకుండా ప్లాటింగ్ చేసి అమాయక ప్రజలను చూసి అంటకడుతిన్నారని అన్నారు, ఇట్టి వారిపై చర్యలు తీసుకోవాలని ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాల మున్సిపాలిటీ కమిషనర్ కు సోమవారం రోజు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సదర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల ఛైర్మన్ చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ యథేచ్ఛగా ప్లాట్ల వ్యాపారం  చేస్తున్నా, అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరించడంతో రియల్‌ వ్యాపారుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. మంచిర్యాల జిల్లా మంచిర్యాల మండలం గరిమ్మిల్ల శివారు సర్వే నంబరు 683, 684/6 లో దాదాపు రెండు సర్వే నంబర్లలో 35 ఎకరాల 34 గుంటల భూమి విస్తీర్ణం కలిగి ఉంది. రియల్‌ వ్యాపారులు పట్టా భూమి పేరిట సర్వే నంబరు 683, 684/6 లో కొంత భూమిని కొనుగోలు చేసి ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యవసాయ భూములను, వ్యవసాయేతర భూములుగా మార్చి  మల్టీ కలర్ బ్రోచర్ తో అన్ని అనుమతులు ఉన్నాయని, ప్రజలను మభ్యపెడుతూ సుమారుగా 102 ప్లాట్స్ ఏర్పాటు చేసి అధిక ధరలకు గజం భూమి ఆరు వేల నుండి పది వేల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని, గతంలో సర్వే నంబరు 683 పై కోర్టు కేసు ఉన్నాట్ల, స్థానికులు అంటున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవడం లేదని, చర్యలు తీసుకుంటామని చెప్పుతున్నా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రాన్ని అనుకొని ఉన్న మున్సిపాలిటీ లలో జోరుగా అనుమతులు లేని రియల్ వ్యాపారం దిన దిన అభివృద్ధిగా సాగుతుంది, ఇట్టి అనుమతులు లేని వెంచర్స్ పై అధికారులు, రాజకీయ నాయకులు సహితం అధిక ప్రేమ చూపిస్తున్నారని, రియల్ వ్యాపారులకు అండగా ఉండి  ప్రోత్సహిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్ధి సంఘాల నాయకులు తోట రాజేష్, చేరాల వంశీ, బచ్చలి ప్రవీణ్, పురెళ్ళ నీతిష్, తదితరులు పాల్గొన్నారు.