రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి

Published: Thursday June 24, 2021

ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన  సంఘం నాయకులు
బెల్లంపల్లి, జూన్ 23, ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లా రేషన్ డీలర్ల సమస్యను సత్వరమే పరిష్కరించి ఆదుకోవాలని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కు వినతి పత్రం అందించిన రేషన్ డీలర్ల సంఘం జిల్లా నాయకులు. బుధవారం నాడు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంపు కార్యాలయంలో కలుసుకుని వినతి పత్రం అందించిన సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ డీలర్లకు ప్రతి నెల 30 వేల రూపాయల గౌరవ వేతనం అందించాలని లేదా క్వింటాల్కు 250 రూపాయల చొప్పున కమిషన్ ఇవ్వాలని, కరోనా సమయంలో పాయింట్ లైన్ వారియార్లుగా గుర్తించి మరణించిన వారి కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందించాలని, ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా మరణించిన వారి కుటుంబాలు ఒకరికి రేషన్ షాప్ కేటాయించాలని వారు పెట్టిన వైద్య ఖర్చులను ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఏర్పాటు చేయాలని, రేషన్ షాపుల ద్వారా ప్రజలకు నిత్యవసర వస్తువులను అందిన్చే సూపర్ మార్కెట్ లాగా ఏర్పాటు చేయాలని, దుమ్ము ధూళితో అనారోగ్యం పాలు అవుతున్న డీలర్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, బియ్యం దిగుమతి చార్జీలను ప్రభుత్వమే భరించాలని, ఓపెన్ మార్కెట్ ధరలను అనుసరించి గన్నీ బ్యాగులను ఇరవై ఎనిమిది రూపాయలకు రేట్లను సవరించాలని, కారుణ్య నియామకాల్లో వారసులుగా నియమితులయ్యే వారికి వయోపరిమితి 40 సంవత్సరాల నుండి 50కి పెంచాలని, ఫోర్ జి జి.ఓద్వారా సర్వర్ డౌన్ సమస్యను శాశ్వతంగా పరిష్కారం అయ్యేలా చూడాలని, ఆన్లైన్ పేమెంట్ ద్వారా నేరుగా గోదాముల నుండి షాపులకు సరుకులు సరఫరా అయ్యేలా చూడాలని, డీలర్లలో విద్యావంతులైన వారికి పదోన్నతులు కల్పించాలని, గ్రామీణ ప్రాంతాల్లో 800కి పట్టణ ప్రాంతాల్లో 1200 మందికి షాప్ చొప్పున కేటాయించాలని, టెంపరరీ గా పని చేస్తున్న రేషన్ డీలర్ల ను ఐదు సంవత్సరాలు పూర్తి చేసిన వారికి శాశ్వత డీలర్లు గా నియమించాలని, ప్రతి సంవత్సరం చేసే తూనికలు కొలతల శాఖ వారు చేసే స్టాంపింగ్ ను రద్దు చేయాలని, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చేసే రెగ్యులరైజేషన్ రద్దు చేసి శాశ్వత ప్రాతిపదికన కొనసాగించాలని, గతంలో లాగా తరుగుదల కోటాను టు పర్సెంట్ అందించాలని, హైదరాబాదులో 1000 చదరపు గజాలతో రేషన్ భవనం నిర్మించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు పోయి పరిష్కారం అయ్యే విధంగా తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం నాయకులు వంగపల్లి రవీందర్రావు, బి.సత్యనారాయణ రెడ్డి, ముర్కూరి చంద్రయ్య, పలువురు తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.