ధర్మరావు పేటలో బౌద్ద ధర్మం వేడుకలు

Published: Tuesday May 17, 2022
దండేపెల్లి , మే16, ప్రజాపాలన ప్రతినిధి:
 
 
మంచిర్యాల జిల్లా దండేపెల్లి మండలం లోని ధర్మారావుపేట లో  బహుజనులు తథాగత్ గౌతమ బుద్ధుని 2566 వ. జన్మదిన వేడుకలు తొలిసారిగా  ఆ గ్రామంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మరావుపేట గ్రామానికి చెందిన ఎం.టి.బి.ఎఫ్ ( ముంబై ) నాయకులు కాశవేణి చంద్రన్న బెస్త   ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కు గురువు ఐన బుద్ధుడి వేడుకలు తన స్వగ్రామంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. జ్ఞానశిల్పి బుద్ధుడి ఆలోచన విధానం సర్వ జీవరాశులకి మానవులకి సుఖ సంతోషాల్ని, లోకశాంతిని, మనశ్శాంతిని ప్రసాదిస్తుందని పేర్కొన్నారు. ఆయన సిద్ధాంతాన్ని మనం స్వంత జీవితాల్లో అనుసరించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  జయంతి సంబురాల్లో అంబెడ్కర్ సంఘం నాయకులు లక్ష్మణ్ దాసరి, నరేందర్, కొల్లూరి రవికుమార్, గజ్జెల సాగర్, దాసరి రాజేందర్, స్వామి, పలాజీ తిరుపతి లతోపాటు చిన్నారులు పాల్గొన్నారు.