గల్లీ నుండి డిల్లీ దాకా గులాబీ జెండా బావుటా

Published: Friday September 03, 2021
మధిర, సెప్టెంబర్ 02, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం మధిర మండలంలో మధిర మున్సిపాలిటీ కేంద్రంలో ఈ రోజు తెరాస జెండా పండుగ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మధిర మండల మున్సిపాలిటీ టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు. ఆసరా పెన్షన్లు, రైతుబంధు, రైతు బీమా, 24గంటల ఉచిత కరెంటు, సాగు నీరు, తాగునీరు, కళ్యాణలక్ష్మీ షాదీ ముభారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు సహాయం, దళితబంధు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, గొల్లకురుమలకు గొర్రెలు, ముదిరాజులకు చేపలు వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా అందజేయడం జరుగుతుందన్నారు. ఉద్యమ రథసారథిగా కేసీఆర్ గారితో ఉప్పెనలా మొదలైన టిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం ప్రజల ఆశీర్వాదంతో ఈనాడు డిల్లీలో కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు. గులాబీ జెండా పట్టాలంటే భయపడిన రోజుల నుండి గులాబీ జెండా ఎత్తడం గర్వకారణమనే స్థాయికి పార్టీ ని కేసీఆర్ గారు ముందుకు తీసుకువచ్చారన్నారు. దక్షిణాది పార్టీ లలో డిల్లీలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయబోతున్న మొట్టమొదటి పార్టీ తెరాస అని ఈ రోజు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమవుతుందన్నారు.