రాష్ట్ర ఏర్పాటు తర్వాత శరవేగంగా తెలంగాణ అభివృద్ధి.

Published: Tuesday November 30, 2021

మధిర నవంబ29 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ హాస్పటల్ నందునేడు దీక్షా - దివస్ రోజును పురస్కరించుకొని మధిర ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న పెసెంట్స్ కి TRS యువజన విభాగం ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేసిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు 2009వ సంవత్సరం నవంబర్ 29న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు TRS పార్టీ అధినేత కేసీఆర్ గారు చేపట్టిన దీక్షా - దివస్ తెలంగాణ రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పిందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు పేర్కొన్నారు.. నేడు దీక్షా - దివస్ ను పురస్కరించుకుని మధిర లోని ప్రభుత్వ హాస్పిటల్ నందు TRS పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొని అక్కడ ఉన్న పెసెంట్స్ కి పండ్లు అందించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఆ రోజు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కేసీఆర్సచ్చుడో. తెలంగాణ తెచ్చుడో అంటూ అమరణ నిరాహారదీక్ష చేపట్టారని ఆ దీక్షా తెలంగాణ ఉద్యమ గతిని మరియు రాష్ట్ర గతిని మార్చేసిందన్నారు. ఆ దీక్షా ద్వారా కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాధించారని కమల్ రాజు గారు గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలతో నేడు దేశానికే మన తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉందని ఆయన స్పష్టం చేశారునాడు నేడు ఎప్పుడు తెలంగాణ యావత్ సమాజం కేసీఆర్ గారి వెంటే ఉందన్నారు.. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, యువజన విభాగం నాయకులు తదితరులు మండల టిఆర్ఎస్ నాయకులు రావూరు శ్రీనివాస్ టిఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వరావ కృష్ణ ప్రసాద్ సీతారామరెడ్డి నరసింహ మూర్తి రమేష్ల్లపళ్ళ పోతులప్రసాద్ తదితరులు పాల్గొన్నార