రోడ్డుపై ముండ్ల పొదలను వెంటనే తొలగించాల శంకరపట్నం నవంబర్02 ప్రజాపాలన ప్రతినిధి:

Published: Thursday November 03, 2022

శంకరపట్నం మండల పరిధిలోని కేశవపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి అంబాలాపూర్ గ్రామనికి వెళ్ళు దారిలో మూల మలుపుల వద్ద ముండ్ల పొదలు రోడ్డుపై అడ్డంగా ఉండడం వలన ఇప్పలపల్లే,అంబాలపుర్ గ్రామాల నుండి వచ్చే వాహనదారులకు విద్యార్థులకు ప్రజలు కు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారని మండల ఆరోగ్య కేంద్రానికి ప్రభుత్వ కార్యాలయాలకు పాఠశాలలకు వెళ్లాలంటే ఈ దారి లో ముళ్ళ పొదలు అడ్డంగా ఉండడంతో అటువైపు వెళ్లే వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక గ్రామ ప్రజలు పలు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు రోడ్డు మూల మలుపుల వద్ద  అడ్డంగా ఉన్న ముండ్ల పొదల వల్ల కొద్ది రోజుల క్రితం ఎదురు ఎదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్న సంఘటన కూడా ఎదురైందని అన్నారు.ఈ పొదల వల్ల రాత్రి వేళలో భయంకర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని వాహన దారులు వాపోతున్నారు ఈ సమస్యను సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు, వెంటనే స్పందించి రోడ్డుపై ఉన్న ముళ్లపదలను వెంటనే తొలగించాలని విద్యార్థులు గ్రామ ప్రజలు కోరుతున్నారు