బూర్గంపాడు ముంపు ప్రాంత ప్రజలను ఆదుకోవాలి. జేఏసీ బృందం.

Published: Tuesday October 11, 2022
బూర్గంపాడు మండలం ప్రజా పాలన.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహాడ్ మండలాన్ని   పోలవరం ముంపు  మండలం గా  ప్రకటించాలని  గత 53 రోజులుగా మండల వాసులు దీక్ష చేస్తున్నారు. 
   బూర్గంపాడు మండల ప్రజలుగోదావరి  వరదల వల్ల సర్వం కోల్పోయి, ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వాలు స్పందించి న్యాయం చేయాలని దీక్ష చేస్తున్నారు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు వల్ల మా ప్రాంతం మొత్తం కూడా వరదమయంగా మారుతుందని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత జులై నెలలో వచ్చినటువంటి వరదల కారణంగా మా ప్రాంతం మొత్తం కూడా నీట మునిగి ఆస్తి నష్టం సంభవించింద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారి సునిసితంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని
మండలంలోని ముంపు ప్రాంతానికి  పోలవరం ప్యాకేజీ  ప్రకటించాలని   కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా   భద్రాచలం  పరిరక్షణ సమితి  జాతీయ అధ్యక్షులు   బూసిరెడ్డి శంకర్ రెడ్డి మరియు పూల పెల్లిసుధాకర్ రెడ్డి, జక్కం సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.  జెఎసికి అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర గవర్నర్   తమిళ సై ను కలిసి  బూర్గంపహాడ్ మండల ప్రజల తరపున  వినతిపత్రం అందిస్తానని అన్నారు.