సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికులకు పూర్తి వేతనం చెల్లించాలి...

Published: Tuesday March 07, 2023

సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికులకు

పూర్తి వేతనం చెల్లించాలి...
 
 
ఖమ్మం మార్చ్ 6 ప్రజా పాలన ప్రతినిధి
ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో పనిచేస్తున్నటువంటి పేషంట్ కేర్, సెక్యూరిటీ, శానిటేషన్ కార్మికులకు ఇంటిగ్రేటెడ్ పాలసీ నెం 60 జీవో ప్రకారం 12093 రూపాయలు రావలసిందిగా వందమంది కార్మికులకు వారి అకౌంట్లో 11,000 మాత్రమే వేస్తూ ఉన్నారు అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ అమౌంట్ అకౌంట్ లో ఇప్పటివరకు వేయలేదని జనవరి, ఫిబ్రవరి నెలలో జీతాలు కూడా ఇవ్వలేదు అని వాటి విషయమై ఖమ్మం మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాజేష్ రావు మరియు అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్స్ ఆఫీసర్ డాక్టర్ అమర్ సింగ్ గార్లకు వినతి పత్రం అందజేసి న్యాయం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో వేముల ధర్మరాజు, లలిత, రమ ,రాధ, ధనలక్ష్మి ,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు