కనకదుర్గమ్మకు కుంభాభిషేకం నిర్వహించిన మంత్రి తలసాని...

Published: Thursday March 24, 2022
అనంతరం సత్యం థియేటర్ చౌరస్తాలో భగత్ విగ్రహం ఆవిష్కరణ...
హైదరాబాద్(ప్రజాపాలన ప్రతినిధి) : అమీర్ పేట లో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బుధవారం  శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నూతన కలశ ప్రతిష్ట, కుంభాభిషేకం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం ఆలయ పండితులు మంత్రికి వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు, అధికారులకు సూచించారు. ఇప్పటికే ఆలయంలో ప్రభుత్వ నిధులు, దాతల సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఇంకా ఆలయంలో చేపట్టవలసిన అభివృద్ధి పనులు ఉంటే నివేదికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్దికి అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారు. తదనంతరం సత్యం థియేటర్ చౌరస్తాలో భగత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. భగత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తలసాని అమీర్ పేట లోని సత్యం దియేటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన భగత్ సింగ్ విగ్రహాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఆలయ చైర్మన్ మల్లిఖార్జునప్ప, EO నరేందర్ బాగిందర్ సింగ్, సురేందర్ సింగ్, బల్విందర్ సింగ్, ప్రహ్లాద్ సింగ్, జోగిందర్ సింగ్, టిల్లు, మధు, నాయకులు కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, అశోక్ యాదవ్, హన్మంతరావు, గోపిలాల్ చౌహాన్, రోజా, లక్ష్మి, లతా, విజయదుర్గ  తదితరులు పాల్గొన్నారు. తదితరులు పాల్గొన్నారు.