పేద ప్రజల ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న సీఎం సహాయనిధి

Published: Thursday October 14, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 13 అక్టోబర్ ప్రజాపాలన : అనారోగ్యానికి గురైన పేద ప్రజలకు దవాఖాన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో దోహదపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.  బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ ఎమ్మెల్యేే డాక్టర్ మెతుకు ఆనంద్ కోటపల్లి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు విడతలవారిగా కార్పొరేట్ వైద్యం చేసుకునే వెసులుబాటు కల్పించడంలో సీఎం సహాయనిధి చేయూతనందిస్తుందన్నారు. సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న నియోజకవర్గ ప్రజల్లో అర్హులందరికీ సకాలంలో చెక్కులు అందేలా చూస్తామన్నారు.
 కుల రహిత సమాజం నిర్మాణమే హితం : 
ప్రేమ వివాహాలు చేసుకున్న దంపతులు కష్టసుఖాలలో ఒకరికొకరు తోడుంటూ ఆదర్శ దంపతులుగా కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. బుధవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్స్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గతంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రూూ. 50,000 ఇచ్చేవారని గుర్తు చేశారు.    
50 వేల రూపాయల ప్రోత్సాహకాన్ని 2 లక్షల 50 వేలకు సీఎం కేసీఆర్ పెంచారని స్పష్టం చేశారు. సమాజంలో కుల మత వర్గబేధాలు లేకుండా కులరహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలోని 8 మంది దంపతులకు ప్రోత్సహక బాండ్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు ధర్మాపురం వెంకటేష్ యాదవ్, ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఉమాదేవి నర్సింలు, ఎంపీటీసీ బందయ్య, మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు మంగలి ప్రవీణ్, షెడ్యూల్డ్ కులాల అభివృధి శాఖ అధికారి ఎన్.మల్లేశం, ఎస్సీ వెల్ఫేర్ సిబ్బంది పాల్గొన్నారు.