జిపి నిధులు మళ్ళింపు...సర్పంచులకు ఉరి

Published: Wednesday January 04, 2023
* నవాబుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొండల్ యాదవ్
వికారాబాద్ బ్యూరో 03 జనవరి ప్రజా పాలన : గ్రామపంచాయతీ నిధులను కేసీఆర్ దారి మళ్లింపు చేసి సర్పంచులకు ఉరితాడు బిగించాడని నవాబుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ యాదవ్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం నవాబుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండల్ యాదవ్ ప్రజాపాలన బ్యూరో రిపోర్టర్ తో మాట్లాడుతూ సర్పంచుల సమస్యలపై గళమెత్తిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామికమని విమర్శించారు. రాష్ట్రంలోని సర్పంచ్‌ల సమస్యలపై ధర్నాచౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చిందని పేర్కొన్నారు. 
రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ధ్వజమెత్తారు. నిధులు విడుదల చేసి పంచాయతీలను ఆదుకోవాలని హితవు పలికారు. స‌ర్పంచులు అప్పుల పాలై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్‌లకు ఈఎమ్ఐలు కట్టలేని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని ఆర్థిక స్థితి దిగజారిందని దెప్పిపొడిచారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గత 7 నెలలుగా పెండింగులో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని, లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.