రైతుల సమస్యలను పరిష్కరిస్తాం

Published: Tuesday July 06, 2021
పరిగి 5 జూలై ప్రజాపాలన ప్రతినిధి : వైయస్ షర్మిల ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లాలో (వైఎస్సార్ టిపి) ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు కోళ్ల యాదయ్య, ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా పుడుర్ మండల పరిధిలోని రాకంచర్ల తీర్మాలపూర్ గ్రామలలో గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు గ్రామస్తులు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఇందిరా జలప్రభా పథకం క్రింద 22 బోర్లు మోటార్లు వచ్చాయి అని దీనిపై ఆధారపడి 70 కుటుంబాలు జీవిస్తున్నాయి అని అన్నారు. అంతేకాకుండా ఒకే సారి రుణ మాపి అయ్యింది అని గ్రామంలో వైస్సార్  ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వంలో ఏమి ఇవ్వలేదు   ఇంటికో ఉద్యోగమన్నా కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి అని పేర్కొన్నారు. నిరుద్యోగులు మాత్రం అలాగే ఉండీ పోయారని తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిందేమి లేదు అని రైతులు ఆవేదన వక్తం చేశారు. మళ్ళీ రాజన్న రాజ్యం రావాలని షర్మిళ  ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మనకు మంచి రోజులు వచ్చే రోజులు... దగ్గరలో ఉన్నాయని షర్మిలమ్మ మనకు అండగా ఉంటుందని, నిరుద్యోగులక మహిళలకు రైతులకు మనోదర్యాన్ని కల్పిస్తూ గ్రామాలలో పర్యటించడం జరిగింది ...... ఈ కార్యక్రమంలో జిల్లా అడాక్ కమిటీ మెంబర్ నరేందర్ పరిగి మండల అధ్యక్షులు జాకబ్. పుడూర్ మండలాధ్యక్షులు యాదగిరి నరేందర్ బాలరెడ్డి శప్పి ఉస్మాన్ రాములు మహేష్ రామయ్య నగేష్ రాంచెంద్రయ్య మహిళలు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.