*పశు మిత్ర వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి* - దుంపల రంజిత్ కుమార్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యద

Published: Thursday March 30, 2023

మంచిర్యాల టౌన్, మార్చి 29, ప్రజాపాలన: పశు మిత్ర వర్కర్స్ యూనియన్ సి ఐ టి యు ఆధ్వర్యంలో పశు మిత్రల సమస్యలు పరిష్కరించాలని మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే కు బుధవారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా దుంపల రంజిత్ కుమార్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమ్మెల్యే లకు, మంత్రులకు , అధికారులకు వేతనాలు పెంచిన ప్రభుత్వం, పశు మిత్రలకు వేతనం పెంచకుండా వెట్టి చాకిరీ చేయుంచుకోవడం చాలా దారుణం అని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి  వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. అనంతరం శ్రీలత పశు మిత్ర వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పశువులకు వైద్యం అందించడానికి, పాడి పరిశ్రమ కు మమ్మల్ని ఐకెపి నుండి తీసుకొని శిక్షణ ఇచ్చారు కానీ కనీస వేతనం మాత్రం ప్రభుత్వం నిర్ణయం చేయకుండా గత 8 సంవత్సరాల నుండి ఉచితంగా సేవలు చేయించుకుంటూ పశువులకు ఇచ్చే మందులు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వకపోవడం తో డబ్బులు పెట్టి మందులు కొని రైతుల పశువులకు వైద్యం చేయాల్సిన దుస్తితి ఉందన్నారు. ఎ ఐ శిక్షణ కూడా ప్రభుత్వం మధ్యలో ఆపేసింది, కనీసం  ప్రభుత్వం కార్మికులుగా కూడా గుర్తించడం లేదని వాపోయారు. వెంటేనే  ప్రభుత్వం స్పందించి పి ఎఫ్, ఈఎస్ఐ ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించి ఎ ఐ శిక్షణ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో  రాజేశ్వరి మల్లిక జిల్లా ఉపాధ్యక్షురాలు, మాణిశ్వరి, రవళి, రమదేవి , రేణుక, సంగీత, సంధ్య, మాధవి, లావణ్య, తదితరులు పాల్గొన్నారు.