బృహత్ పల్లెప్రకృతి వనం నిర్వహణ పనులు పకడ్బంధీగా చేపట్టాలి : జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

Published: Thursday September 09, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 8, ప్రజాపాలన : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో చేపడుతున్న బృహత్ పల్లెప్రకృతి వనం పనుల నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల మున్సిపల్ పరిధిలో గల 9వ వార్డు పాత మంచిర్యాలలో గల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ రివర్ కన్సర్వేటివ్ ప్లాన్ (ఎన్.ఆర్.సి.పి.) సంబంధిత 22 ఎకరాల ప్రభుత్వ భూమిలో 5 ఎకరాలలో బృహత్ పల్లెప్రకృతి వనం పనులు చేపట్టడం జరిగిందని, 5 ఎకరాలలో సెంట్రల్ నర్సరీ, 5 ఎకరాలలో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు తెలిసే విధంగా థీమ్ పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల తహశిల్దార్ రాజేశ్వర్, మున్సిపల్ కమీషనర్ బాలకృష్ణ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.