దళిత బంధు పథకం దేశానికి దిక్సూచి

Published: Saturday October 08, 2022
కోటమ్మర్పల్లి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య
వికారాబాద్ బ్యూరో 7 అక్టోబర్ ప్రజా పాలన : దళిత బంధు పథకం దేశానికే దిక్సూచి అని కోటమ్మర్పల్లి గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య కొనియాడారు. శుక్రవారం మర్పల్లి మండల పరిధిలోని కోటమర్పల్లి గ్రామానికి చెందిన కావలి నర్సిములుకు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన షిఫ్ట్ డిజైర్ కారును వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి పథకం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి ఒకే సారి 10 లక్షల రూపాయలు ఇవ్వడం చాలా సంతోషమని ప్రశంసించారు. లబ్ధి పొందిన లబ్ధిదారులు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల భారతీయ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి బి రాచయ్య, మాజీ ఉపసర్పంచ్  జె.అశోక్, వార్డు మెంబర్ జైహింద్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు తహసీన్, ఖదీర్, సంపత్, నర్సింహ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area