ఘనంగా జరిగిన చీమలదరి సర్పంచ్ జన్మదిన వేడుకలు

Published: Friday October 28, 2022

వికారాబాద్ బ్యూరో 27 అక్టోబర్ ప్రజా పాలన : అందరితో కలుపుగోలుతనంగా ఉంటూ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించే చీమలదరి సర్పంచ్ నాసన్ పల్లి నర్సింహారెడ్డికి పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం మోమిన్ పేట్ మండల పరిధిలోని చీమలదరి గ్రామంలో గ్రామ సర్పంచ్ నాసన్ పల్లి నర్సింహారెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు ప్రస్తుతం చీమలదరి గ్రామ సర్పంచుగా రాజకీయ విధులు నిర్వహిస్తున్న నాసన్ పల్లి నర్సింహారెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆత్మీయ అనుచరగణం, అభిమానులు, బంధువర్గం, హితైషులు శాలువాలతో సత్కరించి పూలమాలాంకృతం చేశారు. రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను గుర్తింపును పొందాలని ఆశీర్వచనాలు అందజేశారు. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజాసేవే పరమావధిగా కృషి చేస్తూ మరెన్నో రాజకీయ ఉన్నత పదవులు అధిష్ఠించాలని మనసా వాచా కోరుకున్నారు. తన చిరునవ్వే రాజకీయ అజాతశతృవుగా కీర్తిప్రతిష్ఠలు చూరగొన్నారని ప్రముఖ రాజకీయ ప్రతినిధులు ప్రశంసించారు.