చివరిశ్వాస వరకు దేశహితమే స్వయంసేవకుల ధ్యేయం - జగిత్యాలజిల్లా ఆర్. ఎస్.ఎస్. కార్యవాహ్ గోల్కొం

Published: Tuesday December 27, 2022

రాయికల్, డిసెంబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి): ఆర్.ఎస్.ఎస్ లో నిత్య శాఖ, ఘోష్ (సంగీతం)వాదనల ద్వారా జాతీయ భావాలు కలిగిన వ్యక్తి నిర్మాణం చేయడం జరుగుతుందని జిల్లా కార్యవాహ్ గోల్కొండ నాగరాజు అన్నారు. రాయికల్ మండల కేంద్రములోని ఆర్.ఆర్ గార్డెన్ లో రెండు రోజులపాటు జరిగిన సమారోహ్ (ముగింపు) కార్యక్రమానికి ప్రధాన వక్త గా పాల్గొని మార్గదర్శనం చేసారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాచీన భారతీయ కుటుంట జీవనం ప్రపంచానికి ఆదర్శమని, హిందూ జాతీయత, సంఘటన, ఐక్యత అవసరమని అన్నారు. భారతీయ సంగీతం అందరిని రంజింపజేస్తుందని, మానవ జీవితంలో మిలితమై ఉంటున్నాయని, నాట్యసంగీతాలు మన జీవితాన్ని నడిపిస్తాయని అన్నారు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తున్నాయని, కరోనా లాంటి వైరస్ లతో ప్రపంచం కకావికలమౌతుంటే ఆత్మనిర్భర్ తో నిలదొక్కుకుని ఆదర్శంగా నిలుస్తుందని, వ్యక్తినిర్మాణం ద్వారా సర్వొన్నతమైన  సమాజానికి రామాయణం జరుగుతుందని, శాఖలలో ఆటపాటల ద్వారా వారికి తెలియకుండానే సర్వొన్నతులుగా నిర్మితమౌతున్నారని అన్నారు. ఎక్కడ అవసరమైతే అక్కడ స్వయం సేవకులు సేవాకార్యక్రమాలు చేస్తున్నారని, చివరిశ్వాస వరకు దేశహితమే స్వయంసేవకుల ధ్యేయమని అన్నారు. సంఘంలో ఘోష్ యొక్క విశిష్టత ను ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి మచ్చ దేవదాసు, వర్గ కార్యవాహ్ సిద్ధ గంగారజం, విభాగ్ ప్రచారక్ భానుచందర్ జీ, జిల్లా ప్రచారక్ లోకేష్ జీ,  జిల్లా ఘోష్ ప్రముఖ్ సుద్దాల మల్లేశం, జగిత్యాల జిల్లా నలుమూలల నుంచి వచ్చిన స్వయంసేవకులు, ప్రజాప్రతినిధులు, పురప్రముఖులు, మాతలు,తదితరులు పాల్గొన్నారు.