మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ప్రతిష్టించుటకు స్థలము కేటాయించాలి

Published: Tuesday March 15, 2022
మంచిర్యాల టౌన్, మార్చి14, ప్రజాపాలన: మహాత్మా జ్యోతి రావు పూలే విగ్రహం మంచిర్యాలలో గల బెల్లంపల్లి చౌరస్తా కూడలి వద్ద ప్రతిష్టించుకొనుటకు స్థలం కేటాయించాలని మున్సిపల్ కమిషనర్ కు బిసి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సంద్భంగా పూలే లాంటి మహనీయులు బిసి సామాజిక వర్గానికి అణగారిన వెనుకబడిన వర్గాలకు, మహిళలు అభివృధి చెందాలి అని చేసిన పోరాటాలు ఉద్యమాలు నేటి సమాజానికి, యువతకు తెలియకపోవడం తెలుసుకునే అవకాశం లేకపోవడం వల్ల దేశంలో బిసిలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ, రాజ్యాంగపరమైన రక్షణ కూడా ఉన్నప్పటికీ వాటిని సరైన విధంగా వినియోగించుకొలేక పోతున్నాము అని అన్నారు, బిసి కులాల ఆత్మగౌరవం కోసం భవిష్యత్ తరాల వారధి కోసం వారి జీవిత చరిత్ర గొప్పతనం వారు చేసిన సంఘ సంస్కరణలు భవిష్యత్ తరాల విజ్ఞానం కోసం మహాత్మా జ్యోతి రావు పూలే విగ్రహం మంచిర్యాలలో గల బెల్లంపల్లి చౌరస్తా కూడలి వద్ద ప్రతిష్టించాలని తద్వారా వారి విలువలు కాపాడడం ఈ విగ్రహ ప్రతిష్టాపన ద్వారా కలుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ జాగృతి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ మీడియా కన్వీనర్ సంతోష్ ఆచార్య పట్టణ అధ్యక్షులు మడుపు రామ్ ప్రకాష్ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్ ఉపాధ్యక్షులు మేంత్యాల సంతోష్ ఎడ్ల పున్నం యువ జాగృతి పట్టణ అధ్యక్షులు మాంచర్ల సదానందం కార్యదర్శి డేగ లక్ష్మణ్ ప్రచార కార్యదర్శి బద్ది శ్రీనివాస్ కార్యనిర్వహణ కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్ సీనియర్ నాయకులు దేవరకొండ విజయ భాస్కర్ సల్ల విజయ కుమార్ మామిడాల ప్రకాష్ ముచ్చ కుర్తి భూమేష్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు