నేడు (మాఘ మాస నవమి) దాస నవమి ** ప్రధాన అర్చకులు అభయ్ ఆచార్య **

Published: Thursday February 16, 2023

ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 14 (ప్రజాపాలన,ప్రతినిధి) : మాఘమాస నవమిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ హనుమాన్ ఆలయంలో దాస నవమి వేడుకలను నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు అభయ్ కుమార్ ఆచార్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 8 గంటలకు స్వామివారికి అభిషేకం,9 గంటలకు హారతి, ప్రవచనం, మంత్రపుష్పం, అనంతరం తీర్థ ప్రసాద వితరణ చేపట్టనున్నట్టు అర్చకులు తెలిపారు. రాత్రి 8 గంటలకు భజన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.