ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ సభ్యుడు రాజ్ కుమార్ ను అభినందించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Wednesday February 24, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దుమాల రాజ్ కుమార్ తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలువగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాజ్ కుమార్ ను అభినందించారు. ఎస్సి, ఎస్టీల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని వారిపై జరుగుతున్న అన్యాయలపై తక్షణం స్పందించి న్యాయం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్ కౌన్సిలర్ బలే లతశంకర్ ముజాహిద్ పట్వారీ వొల్లం మల్లేశం ఏనుగందుల మోహన్ కొత్తూరి గంగారాం దుమాల చంద్రం వారణాసి తిరుమలయ్య గంగారాం తదితరులు పాల్గొన్నారు.