ఆసరా పింఛన్లతో ఆర్థిక లబ్ది

Published: Saturday September 03, 2022
22వ వార్డు కౌన్సిలర్ సుధాంష్ కిరణ్ పటేల్
వికారాబాద్ బ్యూరో 02 సెప్టెంబర్ ప్రజా పాలన : ఆసరా పింఛన్లతో ఆర్థిక లబ్ధి లభించనుందని 22వ వార్డు కౌన్సిలర్ సుదాంశ్ కిరణ్ పటేల్ అన్నారు. వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు కుటుంబ సభ్యులపై ఆర్థికంగా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడే విధంగా సీఎం కేసీఆర్ పెద్ద కొడుకులా ఆదుకుంటున్నాడని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో 22వ వార్డులోని 43 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ల కార్డులను అందజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కౌన్సిలర్ మాట్లాడుతూ ఆసరా లబ్ధిదారులు సీఎం కేసీఆర్ ను కలకాలం గుర్తుంచుకునేలా ఆర్థికంగా చేయూతను అందిస్తున్నారని స్పష్టం చేశారు. వయోభారంతో కుటుంబానికి భారం కాకుండా తమ తమ దగ్గర ఉన్న డబ్బుతో జీవనం కొనసాగించాలని సూచించారు. ఎవరికి చేయి చాచకుండా తమ బతుకుతాము బతికే విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నదని గుర్తు చేశారు. రాబోవు ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారుకు అధిక ఓట్లు వేసి గెలిపించేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కన్నబిడ్డలే కన్నవారని దూరం చేసే ఈ రోజుల్లో సీఎం కేసీఆర్ పెద్ద కొడుకుగా ఆదుకుంటున్నాడని వివరించారు. వయోవృద్ధులకు బీడీ కాడి ఆకుపోక వంటి కనీస అవసరాలు తీర్చుకొనుటకు ఎవరికీ చేయి చాచాల్సిన అవసరం లేదని విశ్వాసం వ్యక్తం చేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పెద్ద మనసుతో 22వ వార్డులోని 43 మంది ఆసరా పెన్షన్లు అందజేసిన సందర్భాన్ని పురస్కరించుకొని కౌన్సిలర్ వార్డ్ కమిటీ సభ్యులు లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేదార్నాథ్ జిల్లా కేసిఆర్ సేవాదళ్ అధ్యక్షుడు బోరెడ్డి రవీందర్ రెడ్డి వార్డు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.