ట్రస్మా వ్యాక్యాల్ని ఖండిస్తున్నాం*

Published: Saturday October 29, 2022
విద్యార్థి సంఘాల జె ఎ సి
 
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 28, ప్రజాపాలన: ట్రస్మా వ్యాక్యాల్ని ఖండిస్తూ  అంబేద్కర్ చౌరస్తా వద్ద   ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన  తెలియజేశారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ట్రస్మా విద్యార్థి సంఘాలను కుల సంఘలని, నకిలీ సంఘలని చేస్తున్న వ్యాఖ్యలను విద్యార్థి జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ప్రైవేట్ పాఠశాలల్లోని లోపాలను బహిర్గతం చేస్తున్నందుకే విద్యార్థి సంఘాలపై ట్రస్మా నాయకత్వం విషం చిమ్మే ప్రయత్నం చేస్తుందని దీనికి ఎవరు భయపడరని అన్నారు, అంతేకాకుండా జిల్లాలోని చాలా పాఠశాలలు ప్రభుత్వ విద్యాశాఖ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్నాయని జీవో ఎంఎస్ నెంబర్ 1 పాటించడంలో, విద్య హక్కు చట్టాన్ని అమలు చేయడంలో నిబంధనలను అనుసరించడం లేదని అన్నారు.పాఠశాలలకు కనీస సౌకర్యాలు అయిన ఫైర్, ఆట స్థలాలు లేకుండా ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఫీజులే పరమావధిగా వ్యహరిస్తున్నరని అన్నారు.   కుల సంఘాలను నకిలీ విద్యార్థి సంఘాలు అని ఆరోపించడం సరికాదని దానిని నిరూపించాలని, విద్యార్థి సంఘాలు చందాల విషయంలో బెదిరింపులకు గురి చేస్తున్నారని అనడం మానుకొని బెదిరిస్తున్న వారి పేర్లను దమ్ము ఉంటే బహిర్గతం చేయాలని సవాలు విసురుతున్నామని అన్నారు. విద్యను వ్యాపారం చేస్తూ బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను ఫీజుల పేరుతో వారి తల్లిదండ్రులను వేధిస్తున్నారని కరోనా సమయంలోని ఫీజులను ప్రభుత్వం 60 శాతం మినహాయింపు ఇచ్చినప్పటికీ పూర్తి ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రుల పై ఒత్తిడి తెచ్చారని, జర్నలిస్టుల పిల్లలకు ప్రభుత్వం సూచించిన ఫీజు రాయితీల విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని, ప్రతి ఏడూ తల్లిదండ్రులను  సంప్రదించకుండా అడ్డగోలుగా ఫీజులు పెంచుతూ, పుస్తకాలు, దుస్తులు తమ దగ్గర, తాము సూచించిన దగ్గర మాత్రమే కొనాలని చెప్తూ ధన దాహార్తిని తీర్చుకుంటున్నారని, ఈ విషయంలోనే విద్యార్థి సంఘాలు చేస్తున్న పోరాటాలను జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వెంటనే ఈ ఆరోపణలను వెనక్కి తీసుకొని విద్యార్థి సంఘాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో పలు ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని ఈ ఉద్యమంలో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో చిప్పకుర్తి శ్రీనివాస్ టి వి యు వి,
జమ్మిడి గోపాల్ ఎన్ ఎస్ ఎఫ్, జాగిరి రాజేష్ బి ఎస్ పి,చెన్నూరి సమ్మయ్య  ఎం ఆర్ పి ఎస్,బచ్చలి ప్రవీణ్ కుమార్ వి జె ఎస్,
చేరలా వంశీ టి పి వి ఎస్,
సల్మాన్  బి సి వి ఎస్,
వడ్ల కొండ సంజయ్ ఎం ఎస్ ఎఫ్,పురేళ్ల నితీష్ తదితరులు పాల్గొన్నారు.