మధిర జూలై 19 ప్రజాపాలన ప్రతినిధి మంగళవారం నాడుమండలంలో,

Published: Wednesday July 20, 2022
పరిధిలోరాయపట్నం గ్రామంలో, ఐ టి సి-ఎం.ఎస్.కె వారి సహకారంతో ఆదర్శ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో రాయపట్నం ఏబీసీ గ్రూప్ సభ్యులకు వరి డ్రమ్ సీడర్ ను అందజేయడం జరిగింది. ఈ డ్రమ్ సీడర్ సహాయంతో వరిసాగు విధానం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది, ఈ వరి సాగు విధానం వల్ల రైతులకు, ఎకరానికి సుమారు ఏడు వేల రూపాయలు వరకు కూలీ ఖర్చులు మిగులుతాయని మరియు నీటిని కూడా ఆదా చేసుకొని వ్యవసాయం చేయొచ్చు అని ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డి. సత్యనారాయణ తెలియచేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో రాయపట్నం ఏ.ఇ.ఓ అఖిల ప్రియ, గ్రామ సర్పంచ్ నండ్రు సుశీల మరియు మండల కమ్యూనిటీ ఆర్గనైజర్ యం. రాజీవ్ గాంధీ, మరియు రైతులు  నండ్రు తిమోతి, కంచెం గోపి, ఇశ్రాయేలు, రవితేజ, గోళ్ళ వీరస్వామి, పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు