భూములు కోల్పోయిన రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వం* ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి*

Published: Wednesday September 07, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 6 ప్రజాపాలన ప్రతినిధి.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోగల
బండరావిరాల , చిన్నరావిరాల గ్రామము సర్వే నెం . 268 భూమిని కోల్పోయిన రైతులు  1972 , 1979 , 1994 , 1999 సంవత్సరాలలో 4 విడతలుగా 209 మంది రైతులకు పట్టాలు జారీచేసినారు . ఇందులో దళితులకు , బడుగు , బలహీన వర్గాల కుటుంబాలకు అసైన్మెంట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది దాన్ని ఆధారం చేసుకున్న సంవత్సరాలుగా సాగు చేస్తున్న రైతులు ఇటువంటి భూమిని మైనింగ్ జోన్ గా ప్రకటించి ప్రభుత్వం మైనింగ్ జోనల్ గా ప్రకటించడం జరిగింది  క్రషర్ మిషన్ యజమానులకు అప్పగించడం జరిగింది 18 సంవత్సరాలు గడుస్తున్న రైతులకు  నష్టపరిహారం అందివ్వడం లేదని  రైతులు మనస్థాపానికి గురై 60 మంది రైతులు మృతి చెందారు. అయినా పట్టించుకోని  209  కుటుంబాల  నోట్లో మట్టుకొట్టి కొడుతున్నారు.   ప్రభుత్వం  నష్టపరిహారం ఇచ్చేంత వరకు  నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి  ప్రభుత్వపై మడ్డిపడ్డారు  బండరావిరాల , చిన్నరావిరాల గ్రామస్తులు మైనింగు జోను క్రింద భూములు తీసుకున్నప్పటి నుండి మా రెవెన్యూలో ఉన్న కంకర మిషన్ యాజమానులు ఒక రోజుకు ఒక కోటి రూపాయల బిజినెస్ చేస్తున్నారు . కంకరమిషన్ యాజమానులు మరియు ప్రభుత్వం తలుచుకుంటే ఇంచుమించుగా రెండు లేదా మూడు నెలల ఆదాయం తీస్తే భూములు కోల్పోయిన భూములలో కొన్ని వేల కోట్లు సంపాదీస్తూ యజమాన్యం గడిస్తున్నారు. , కాని రైతుల నోట్లో మట్టి కోడుతున్నారు . రైతులకు నష్టపరిహారం వస్తుంది కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మా భూములు మాకు వచ్చేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వం  ప్రజాప్రతినిధులను కంకరమిషన్ యాజమాన్యం చేతిలో పెట్టుకొని ప్రజలను మభ్యపెడుతున్నారు. బండరావిరాల గ్రామస్తులు 2004 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా కొనసాగుతున్న  నారా చంద్రబాబునాయుడు గారిని కలవడం జరిగింది , అప్పటినుండి మొదలుకొని ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని కలిసి వినతిపత్రం అందజేశారు. మరియు.  ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిసి బండరావిరాల చిన్న రావిరాల గ్రామస్తుల గోడు విలపించారు. స్థానికి శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్రెడ్డి ని కలసి  మొరపెట్టుకున్న న్యాయం చేయలేకపోయారు. మాకు న్యాయం జరిగేంతవరకు మా పోరాటం కొనసాగుతుందని రైతులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగేంత వరకు రైతుల వెంట  ఉంటానని అన్ని విధాల సహకరించి మీ భూములకు నష్టపరిహారం చెల్లించేంతవరకు రైతుల వెన్నై ఉంటానని కోమటిరెడ్డి తెలిపారు.