బోర్ వేయించిన ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపిన సర్పంచులు

Published: Tuesday February 16, 2021
బీరుపూర్, ఫిబ్రవరి 14 (ప్రజాపాలన): బీరుపూర్ మండలం తాల్లధర్మారం గ్రామంలోని అరగుండాల దేవుని వద్ద కొల్వాయి తుంగూర్ కండ్లపల్లి చిత్రవేనిగూడెం కమ్మునూర్ రేకులపల్లి గ్రామాల భక్తుల త్రాగునీటి వసతి కోసం స్థానిక ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కు విన్నవించగా వెంటనే స్పందించి బోర్ వేయించిన ఎమ్మెల్యే కు ఆయా గ్రామాల ప్రజల తరుపున సర్పంచులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మాజీ జడ్పీటీసీ కోలుముల రమణ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్ల మహిపాల్ రెడ్డి ఎంపీటీసీ నారపాక రమ పార్టీ మండల అధ్యక్షుడు నారపాక రమేష్ ముక్క శంకర్ సర్పంచులు పర్వతం రమేష్ చిక్రం సుగుణమారుతి యేసుదాసు చుంచు శారదనరేందర్ ఎలగందుల లక్ష్మీఅశోక్ రిక్కల ప్రభాకర్ బందేల మరియరాజేశం నాయకులు రంగు మల్లేశం ఎలుగందుల అనిల్ కుమార్ రామకిస్తూ గంగాధర్ జక్కుల చంద్రయ్య గుండ సురేష్ లింగన్న బద్ది భీమన్న చంద్రయ్య సతయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.