గ్రామాల్లో హైపో క్లోరైడ్ ద్రావకం పిచికారీ

Published: Tuesday April 27, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో కరోనా నివారణకు గ్రామంలోని వీధులలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో హైపో క్లోరైడ్ ద్రావకాన్ని పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు బోల్లా లలిత శ్రీనివాస్, వంగాల భిక్షపతి గౌడ్, ఉలిపే మల్లేశం, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.