ఈ నెల 29న పిడిఎస్ బియ్యం వేలం

Published: Tuesday October 26, 2021
జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్
వికారాబాద్ బ్యూరో 25 అక్టోబర్ ప్రజాపాలన : జిల్లాలో పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా బహిరంగ మార్కెట్లో విక్రయించుటకు ప్రయత్నించిన వారిపై 6A చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి అట్టి బియ్యాన్ని జప్తు చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ (సివిల్ సప్లై) మోతిలాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 1576.78 క్వింటాళ్ల బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జప్తు చేసి (4) ఎంఎల్ఎస్ పాయింట్లలో భద్రపర్చడం జరిగిందని పేర్కొన్నారు. జప్తు చేయబడిన పిడిఎస్ బియ్యాన్ని ఈ నెల 29 న ఉదయం 11:00 గంటలకు జిల్లా అదనపు కలెక్టర్ ఛాంబర్ లో బహిరంగ వేలం వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఆసక్తి గల వారు వేలం పాటలో లక్ష రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ ను డిసిఎస్ఓ వికారాబాద్ పేరున తీసి దానితో పాటు ఆధార్, పాన్ కార్డు జిరాక్స్ లను బహిరంగ వేలం చేయు సమయంలో సమర్పించాలని అయన వివరించారు.