కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Published: Thursday January 27, 2022
మంచిర్యాల బ్యూరో‌, జనవరి 26, ప్రజాపాలన : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రంలో బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ  హైటెక్ సిటీ లోని తన నివాసం ముందు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఏఐసీసీ సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు లు మాట్లాడుతూ భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించి 73 వసంతాలు పూర్తి చేసుకుందని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగ రూపకల్పన జరిగిన అనంతరం దేశ ప్రజలకు ప్రజాస్వామిక హక్కులను కల్పించిన శుభ దినము అని వారు గుర్తు చేశారు. రాజ్యాంగంలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, రిజర్వేషన్లు ఇలాంటి అనేక ప్రయోజనాలను అంబేద్కర్ దేశ ప్రజలకు ముందుచూపుతో ప్రయోజనాలను కల్పించారని వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మాజీ టీపీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు రావుల ఉప్పలయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పుదరి తిరుపతి, పట్టణ ఇంచార్జ్ తూముల నరేష్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాబన్న, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేశ్, కౌన్సిలర్ జోగుల శ్రీలత -సదానందం, దాసరి లచ్చన్న, సత్తార్, షకీల్, ఆత్రం శంకర్, భీమా గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.