భూమి భుక్తి వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ

Published: Tuesday September 27, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 
వికారాబాద్ బ్యూరో 26 సెప్టెంబర్ ప్రజా పాలన : వీరనారి చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకొని బి సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అంబేద్కర్ భవనములో వీరనారి చాకలి ఐలమ్మ చిత్ర పటానికి వికారాబాద్ శాసన సభ్యులు మెతుకు ఆనంద్  పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, భూమి, భుక్తి, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన గొప్ప పోరాట యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు.  ఆమె త్యాగాలను  ఉద్యమ స్ఫూర్తిని భావి తరాలు గుర్తించుకొని అదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.   ఆమె అసలు పేరు చిట్యాల ఐలమ్మ అని కులం పేరుతొ చాకలి ఐలమ్మగా ప్రసిద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఉపేందర్, షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ అధికారి మల్లేశం,  వికారాబాద్ ఆర్ డి ఓ విజయకుమారి, తహసీల్దార్ షర్మిల, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాంరెడ్డి, బిసి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.