చెరువుమాధారం మహిళ మత్స్య సోసైటీ కి ఏకగ్రీవంకు సిద్ధపడ్డ సంఘం సభ్యులు.

Published: Monday December 05, 2022
చెరువుమాధారం మహిళ మత్స్య సోసైటీ కి 
 
ఏకగ్రీవంకు సిద్ధపడ్డ సంఘం సభ్యులు.
 
 
పాలేరు డిసెంబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి
నేలకొండపల్లి
మండలం లోని చెరువుమాధారం మహిళ మత్స్య సహకార సంఘం ఎన్నికల కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదలు చేశారు. సొసైటీలో మొత్తం 290 మంది సభ్యులు ఉన్నారు. గత 30 ఏళ్ల నుంచి ఈ సంఘం అభివృద్ధి కి పలు కార్యక్రమాలు చేస్తుంది. ప్రతీ ఐదు ఏళ్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 14 న ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 9 మంది ని డైరెక్టర్ ను ఎన్నుకునే విధంగా సహకార అధికారులు షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ నెల 5 నుంచి 7 వరకు నామినేష న్లు ను
 
'స్వీకరించనున్నారు. నామినేషన్లు వేసిన అభ్యర్థుల పత్రాలను ఈ నెల 8న
పరిశీలన. 9న ఉపసంహారణ. అదే రోజున గుర్తులను
 
ప్రకటించనున్నారు. 14 వ తేదిన ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి
 
మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఆ తరువాత లెక్కింపు ను చేసే
 
విధంగా అధికారులు షెడ్యూలను విడుదల చేశారు. ఫలితాల తరువాత
 
మూడు రోజుల తరువాత ఆఫీస్ బేరర్ల ను ఎన్నుకొనున్నారు. ఎన్నికల
 
అధికారి గా అసిస్టెంట్ రిజిష్టార్ ఎస్.వి.ఎస్.ప్రసాద్ ను నియమించారు.
 
కమిటి ఏకగ్రీవంగా లాంచనమే.....
చెరువుమాధారం మత్స్య సహకార సంఘం ఎన్నికల కు అధికారులు
 
షెడ్యూల్ ను విడుదల చేశారు. కాగా ఆదివారం సంఘం సభ్యులు స్థానిక ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సభ్యులు సమావేశం ను నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికలు నిర్వహించకుండా ఏకగ్రీవంగా చేసుకునేందుకు సభ్యులు ఏకగ్రీవంగా అమోదించారు. ఆఫీస్ బేరర్ల గా రెడ్డిబత్తుల అచ్చాయమ్మ, (అధ్యక్షరాలు), తెల్లగొర్ల భారతి.(ఉపాధ్యాక్షురాలు), యడవల్లి హైమవతి,(కార్యదర్శి), డైరెక్టర్ల గా  బీ. అంతమ్మ, పొట్టపింజర రాజ్యం, పగిడిపత్తి వెంకటనర్సమ్మ, షేక్ పుల్సాన, దేశబోయిన భారతమ్మ, యచౌడం సుశీల లను ఏకగ్రీవంగా
 
ఎన్నుకునేందుకు తీర్మానించారు.