ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా రెండోసారి మడుపల్లి లక్ష్మణ్ ఎన్నిక మధిర ఆగస్టు 29 ప్రజా

Published: Tuesday August 30, 2022
అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా మద్దెలకు చెందిన మడుపల్లి లక్ష్మణ్ రెండోసారి ఎన్నికయ్యారు.  ఈనెల 26 27 తేదీల్లో కొత్తగూడెంలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో భాగంగా కొత్తకమిటి లో   లక్ష్మణ్ కు తిరిగి అవకాశం కల్పించారు.  2015 లో ఏఐఎస్ఎఫ్ సభ్యత్వం తీసుకొని 2015నుంచి 16 వరకు మధిర డివిజన్ కార్యదర్శిగా పనిచేశారు.2016 సంవత్సరంలో మధిర రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన మూడు రోజులు పాటు నిరవధిక నిహార దీక్షలో అమరజీవి కామ్రేడ్ మందడపు నాగేశ్వరరావు  అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆదేశాల మేరకు దీక్షలో పాల్గొన్నారు. 2016లో ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులుగా. జిల్లా పునర్విభజనలో భాగంగా జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తూ తొలిసారి 2017 సంవత్సరంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా,
 2018లో  ఖమ్మం జిల్లా  అధ్యక్షునిగా ఎన్నికవ్వటం జరిగింది. అనంతరం 2018 సెప్టెంబర్ లో రంగారెడ్డి లో జరిగిన  తెలంగాణ రాష్ట్ర రెండో మహాసభల్లో రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా,  డిసెంబర్ 2021  లో ఖమ్మంలో జరిగిన ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా 26వ మహాసభల్లో రెండోసారి ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా నియమించబడ్డారు. 
ఈ సందర్భంగా మడుపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నికకు సహకరించిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీకి సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీకి తోటి కౌన్సిల్ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేశారు. విద్యారంగ సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తానని ఏఐఎస్ఎఫ్ సంఘాన్ని  అగ్రగామిగా నిలుపుతానని ఆయన అన్నారు. ఈ ఎన్నిక పట్ల సిపిఐ పార్టీ జిల్లా మండల నాయకులు ప్రజాసంఘ బాధ్యులు పలువురు అభినందనలు తెలియజేశారు.