విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ** ఐటిడిఎ పిఓ వరుణ్ రెడ్డి **

Published: Wednesday September 14, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 13(ప్రజాపాలన, ప్రతినిధి) : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఐటీడీఏ పీవో కె వరుణ్ రెడ్డి ఉపాధ్యాయులను హెచ్చరించారు. మంగళవారం స్వచ్ఛ గురుకులం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వాంకిడి మండల కేంద్రంలో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలను పాటించకపోవడం, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న బయో సైన్స్ ఉపాధ్యాయుడు జంగును విధుల నుండి పి ఓ సస్పెండ్ చేశారు.విద్యార్థుల ఆరోగ్యం, విద్యపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నాణ్యమైన విద్య తో పాటు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశించారు. సీజనల్ వ్యాధులతో అనారోగ్యాల బారిన పడిన విద్యార్థులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించాలని  వైద్యురాలు ను ఆదేశించారు.
అనంతరం ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాంకిడి తేనే శుద్ధి పరిశ్రమను జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి తో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన మిషన్లను పివో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏ పీ ఓ భీమ్రావు, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.