వివాహ వార్షికోత్సవం సందర్భంగా శాంతి నిలయంలో అన్నదాన కార్యక్రమం కార్యక్రమాన్ని నిర్వహించి

Published: Saturday August 20, 2022

బోనకల్ ,ఆగస్టు 19 ప్రజా పాలన ప్రతినిధి: మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మండల పంచాయతీ రాజ్ ఏ ఈ ఈ నవీన్ కుమార్ - శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దంపతులు మండల కేంద్రంలోని మానసిక బాలికల శాంతి నిలయంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 
ఈ సందర్భంగా నవీన్ కుమార్ దంపతులు మాట్లాడుతూ.... మండల కేంద్రంలో ఎంతోమంది మానసిక బాలికల కు ఆశ్రయం కలిగించిన శాంతి నిలయం సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతినిత్యం మానసికంగా బాధపడుతున్న పిల్లలను ఎంతో శ్రద్ధతో చూసుకోవటం అంత సులువైన పని కాదని, కానీ 80 మంది ఉన్నా మానసిక బాలికలను అనునిత్యం కాపాడుతూ వారి వారి మంచి చెడ్డలు చూస్తూ ఆరోగ్యపరమైన ఇబ్బందులను కాపడుకుంటూ ఆహ్లాద కరమైన వాతావరణంలో బాలికలను ఉంచటం నిజంగా చాలా అభినందనీయమైన విషయమని, సిస్టర్ల జీవితాలను త్యాగం చేస్తూ ఇంతటి కష్టమైనా మానసిక వికలాంగుల శాంతినియాన్ని నడిపిస్తున్నందుకు శాంతి నిలయం సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. 
ఈ కార్యక్రమంలో శాంతి నిలయం నిర్వాహకురాలు సిస్టర్ అల్ఫీ, శాంతి నిలయం సిబ్బంది , పంచాయతీరాజ్ ఏఈ నవీన్ కుటుంబ సభ్యులు కళావతి, రాజా లు పాల్గొన్నారు.