పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలి. .. ధర్నా గోడ ప్రతులను ఆవిష్కరించిన కాంగ్రెస్ నాయకులు.

Published: Wednesday November 16, 2022
జన్నారం, సెప్టెంబర్ 16, ప్రజాపాలన: 
 
 భారత నూతన అత్యున్నత పార్లమెంటుకు అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈనెల 28 29 తేదీలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దర్నాకు సంబంధించిన గోడపత్రులను మంగళవారం  తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోర్లకుంటా ప్రబూదాస్ ఆవిష్కరించారు . మంగళవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో మాట్లాడుతూ డిల్లీలో నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పేట్టి చిర స్థాయిగా చరిత్రలో నిలిచే విదంగా చూడాలని అన్నారు. రాష్ట్ర సచివాలయంలో 1025 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అయన తెలిపారు. ఈ కార్యాక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దావుల రమేష్, తాళ్లపల్లి రాజేశ్వర్ రాష్ట్ర నాయకులు, బచ్చల అంజన్న రాష్ట్ర కార్యదర్శి,  కొత్తపెళ్లి మహేందర్ ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు, తౌటు సంజీవ్ జిల్లా కార్యదర్శి, పూర్వపు రాజారాం, దుర్గం చంద్రశేఖర్, బైరి తిరుపతి, నేరెళ్ల లక్ష్మణ్,  పి ప్రశాంత్, బాదావత్ రాజు, చాకలి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.