తెలంగాణ రాష్ట్ర రవాణా బంద్ మే 19 న విజయవంతం చేయాలి

Published: Wednesday May 18, 2022
సి ఐ టి యు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ పిలుపు
 
 మంచిర్యాల టౌన్, మే 17, ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్ర రవాణా బంద్ మే 19 న విజయవంతం చేయాలని  సి ఐ టి యు ఆధ్వర్యంలో మంగళవారం రోజున భీమారం మండల కేంద్రంలోని ఆటో  అడ్డాల    కార్మికులతో మాట్లాడి కరపత్రం విడుదల చేశారు . ఈ సందర్భంగా సి ఐ టి యు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2019 సంవత్సరంలో మోటార్ వాహనాల చట్టం 2019 ని  సేఫ్టీ పేరుతో భారీ చలాన్లు పెంచుతూ  ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది, ఈ చట్టం ద్వారా మోటార్ వాహన యజమానులు, కార్మికులు నడ్డి విరిచి వేలాది, లక్షలాది రూపాయల పెనాల్టీలు వేసి,కార్మికుల బతుకులపైన పెను భారం మోపుతోందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
అన్ని వాహనాల పైన విపరీతమైన పన్నులను పెంచింది.  ఏప్రిల్ 1 నుండి జీవో నెంబర్ 714 ప్రకారం ఫిట్ నెస్, రెన్యువల్  గడువు అయిన తర్వాత రోజుకు  50 రూపాయల చొప్పున పెనాల్టీలు వేస్తున్నారు, కరోనా వలన
ఒక్కొక్క వాహనానికి రెండు, మూడు సంవత్సరాల ఫిట్ నెస్  పెండింగ్లో ఉన్నవి, ఆటో, క్యాబ్, లారీ కార్మికులు తీవ్ర నష్టాన్ని చవి చూశారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఖజానా నింపుకోవడానికి  భారీ జరిమానా విధించడానికి పూనుకున్నాయి అన్నారు. వెంటనే రోజు 50 రూపాయల పెనాల్టీని రద్దు చేసి రవాణా రంగ కార్మికుల ను ఆదుకోవాలని డిమాండ్.
19 న జరిగే రాష్ట్ర రవాణా బంద్ లో అందరు పాల్గొని జయప్రదం చేయాలని పిలపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో  మండల ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు  రమేష్, శ్రీనివాస్, మహేష్, సుధాకర్, శంకర్, తిరుపతి,కుమార్ తదితరులు పాల్గొన్నారు