ఘనంగా సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి

Published: Wednesday February 22, 2023

ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 21 (ప్రజాపాలన,ప్రతినిధి) : జిల్లా కేంద్రంలో బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ 284 వ జయంతిని మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో సేవాలాల్ ఉత్సవ కమిటీ జిల్లా గౌరవాధ్యక్షులు రాథోడ్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దీక్ష గురువు ప్రేమ్ సింగ్ మహారాజ్, జెడ్పి చైర్ పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ మంత్రి అంబర్ సింగ్ సిలావత్, కలెక్టర్ హేమంత్ మహాదేవ్ బోర్కడే, అదనపు కలెక్టర్ చాహత్ వాజ్పాయ్, జెడ్పిటిసి నాగేశ్వర్ రావు, లు ర్యాలీలో పాల్గొని సేవాలాల్ మహారాజ్ జెండా ఆవిష్కచి, గురుదేవ్ ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో మహా భూగ్ బండార్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్, సింగిల్ విండో చైర్మన్ అలీ బిన్ హమ్మద్, రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు నాయక్, జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్, కమిటీ గౌరవ అధ్యక్షులు శంకర్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాదావత్ శివప్రసాద్, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.