అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు

Published: Tuesday June 28, 2022

కోరుట్ల, జూన్ 27 (ప్రజాపాలన ప్రతినిధి):
ఏఐసీసీ మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం అదేశాల మేరకు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు సూచనలతో కోరుట్ల నియోజకవర్గం కేంద్రంలో కొత్త బస్ స్టాండ్ వద్ద గల డా.బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు  ఆధ్వర్యంలో కాంగ్రెస్ సత్యాగ్రహదీక్ష  చేపట్టడం జరిగింది. మోడీ ప్రభుత్వం ఆలోచన లేకుండా, సంప్రదింపులు గానీ, చట్ట సభల్లో ఎటువంటి చర్చ జరపకుండా త్రివిధ దళాల కోసం తీసుకువచ్చిన అగ్ని పథ్ స్కీమ్ తక్షణమే వెనక్కి తీసుకుని ఎప్పటిలాగే పాత పద్ధతిలో త్రివిధ దళాల నియమాకాలు జరపాలని కోరుతూ కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరడం జరిగింది.  త్రివిధ దళాల్లో చేరి ప్రాణాలకు తెగించి దేశ రక్షణ కోసం పోరాడుతున్న వీర సైనికులు మరియు వాళ్ళ కుటుంబాలు అనాలోచిత అగ్ని పథ్ స్కీమ్ వల్ల విద్య, వైద్య సదుపాయాలు కోల్పోవాల్సిన  పరిస్థితి ఏర్పడుతుందని, పెన్షన్ సౌకర్యం కూడా ఉండదు అని తెలపడం జరిగింది. సికింద్రాబాద్ ఘటనతో పాటు దేశ వ్యాప్తంగా అగ్ని పథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా నిరసనలలో పాల్గొన్న ఆర్మీ అభ్యర్థుల మీద పెట్టిన కేసులను వెనక్కి తీసుకువాలని డిమాండ్ చేశారు.మోడీ ప్రభుత్వం అగ్ని పథ్ స్కీమ్ ను యుద్ద ప్రాతిపదికన రద్దు చేయాలని ఒక వేళ రద్దు చేయకపోతే ఆర్మీ అభ్యర్థుల తరపున  అండగా నిలిచి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమలు చేపడతామని హెచ్చరించారు