పీర్జాదిగూడ కార్పొరేషన్ కు సంభందించిన వివిధ అంశాలపై కేటీఆర్ కు వివరణ

Published: Wednesday June 23, 2021
మేడిపల్లి, జూన్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పాలకవర్గం మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు, నాయకులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ ను కలిసి పీర్జాదిగూడ కార్పొరేషన్ కు సంభందించిన వివిధ అంశాలపై చర్చించారు. మేడిపల్లి సర్వే నెం.62 లో SC కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. పర్వతాపూర్ (సోలార్ జంగ్ కంచ) సాయి ప్రియ కాలనీ వాసుల ల్యాండ్ సమస్యను పరిష్కరించాలని కోరారు. వర్షా కాలంలో వచ్చే వరదలను మళ్లించి ముంపునకు గురవుతున్న కాలనీను రక్షించడానికి సుమారు 90.00కోట్లతో స్ట్రాం వాటర్ డ్రైన్ లైన్ నిర్మాణం ప్రభుత్వం చేపట్టాలని కోరారు.పీర్జాదిగూడ కమాన్ నుండి పర్వతాపూర్ వరకు ఉన్న ఆర్ అండ్ బి రోడ్డును 4లైన్ రోడ్డుగా విస్తరణ పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం నుండి అనుమతి ఇప్పించాలని కోరారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో 7 థీమ్ పార్కులను హెచ్ఎండిఎ నిధులతో అభివృద్ధి చేయుటకు ప్రభుత్వ అనుమతుల గురించి వివరించారు పై విషయాలపై మంత్రివర్యులు కేటిఆర్ సానుకూలంగా స్పందించారు. అందుకు మేయర్ జక్క వెంకట్ రెడ్డి మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కౌడే పోచయ్య, కే.సుభాష్ నాయక్, నాయకులు దర్గ దయాకర్ రెడ్డి, పప్పుల అంజిరెడ్డి, బైటింటి ఈశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.